హ్యాట్రిక్ ఫ్లాపుల అందుకున్న సాయి ధరమ్ తేజ్ కొంత విరామం తర్వాత చిత్రలహరి సినిమా చేస్తున్నాడు. ‘నేను సైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ ఈరోజే రిలీజై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
అయితే గత కొన్నేళ్లుగా వరుస అపజయాలతో సతమతమవుతున్న ధరమ్ బాబు ఇప్పుడు కొత్త ప్రయోగం చేయబోతున్నాడు. చిత్ర లహరి తర్వాత చేయబోయే సినిమాకు సొంతగా కథను సిద్ధం చేస్తున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకని శ్రేయోభిలాషులు నచ్చచెప్పడానికి ప్రయత్నించినా వినిపించుకోవటం లేదట. మరి ధరమ్ బాబు ఎలాంటి వ్యూహ రచనలో ఉన్నాడో ?!