మహేష్ , సుకుమార్ మధ్య అసలేం జరిగింది?

0
203

మైత్రి  నిర్మాణ  సంస్థలో  మహేష్  సుకుమార్  కలిసి  సినిమా  చేస్తారని  అనుకున్నారు  అంతా. అయితే ఇప్పుడది జరగడం లేదు. మొదటగా  తన  దగ్గర  ఉన్న  రెండు  కథల్నీ  చెప్పాడట  సుకుమార్.‌  మహేష్ కి  నచ్చలేదు.

ఈ  సారి  మహేష్ ని  ఎలాగైనా  ఒప్పించాలని  సుకుమార్  తన జీవితంలో  మొదటిసారి  సింగపూర్  వెళ్లి మరీ  కథ  రాసుకొచ్చాడు. అందులో కూడా  మహేష్‌  కొన్ని  కీలక మార్పులు  చేయవలసిందిగా  కోరాడు. అది  సుకుమార్ కి  ఏ  మాత్రం నచ్చలేదు.  అప్పటికే  తీవ్ర  అసంతృప్తితో  సుకుమార్ ,  తనకు చెప్పకుండా  అనిల్ రావిపూడి కి  డేట్స్  ఇవ్వడం  బాధేసింది. అదే‌  క్రమంలో  కథల  కోసం  వెతుకుతున్న  బన్నీని  కలవడం, కథ  నచ్చడం,  ఓకే  చేయడం  జరిగిపోయాయి.‌  వెంటనే  సినిమాని  ప్రకటించమని  బన్నీ  ఆఫీస్ కి  ఆదేశాలు  పంపాడట  సుక్కు.  ఈ సినిమా  ప్రకటిస్తున్నట్లు  ఇటు  మహేష్ కి  అటు  మైత్రి  నిర్మాణ  సంస్థకు  చెప్పలేదు. అనుమతి  లేకుండా  ప్రకటించినా  మహేష్  హుందాతనంగా  ప్రవర్తించడం  గమనార్హం. వీరి  ఇద్దరి  మనస్పర్థల్లో  ఏదైనా  తేడా  జరిగితే  బలయ్యేది  బన్నీయే.  ముందు‌ ముందు  ఇంకేమ్  జరుగుతుందో  చూడాలి.