బ్లాక్ బస్టర్ సాంగ్ కు డాన్స్ చేస్తుండగా గాయపడ్డ హీరో విశాల్ !

0
233

దాదాపు  మూడేళ్ళ  క్రితం  రిలీజైన  బ్లాక్  బస్టర్ సాంగ్  తెలుగులో  ఎంత  పాపులర్  అయ్యిందో  అందరికి  తెలిసిందే.  అయితే  హీరో  విశాల్  ఈ  పాటను  నమ్ముకొని  మోసపోయాడు.

వివరాల్లోకెలితే , విశాల్  హీరోగా  తెలుగులో  సూపర్ హిట్టయిన  టెంపర్  సినిమాను  అయోగ్య పేరుతో తమిళంలో  రీమేక్  చేస్తున్నారు. ఆ  సినిమాలో  ఒక  మాస్  సాంగ్ బావుంటుందని  భావించిన  విశాల్  బ్లాక్  బస్టర్  సాంగ్ ని   ఎంచుకున్నాడు.  సెట్లో  ఈ  పాటకి  డాన్స్  చేస్తుండగా  అరికాలి  ఎముక  చెదిరి  ఖంగు  తిన్నాడు.  ప్రస్తుతం  చికిత్స  పొందుతున్నాడు.  అతను  కోల్కొనేలోపు  తాత్కాలికంగా చిత్రీకరణ  నిలిపి  వేశారు.

అయోగ్య  చిత్రంలో  విశాల్ కి  జంటగా  రాశి ఖన్నా హీరోయిన్ గా  నటిస్తుండగా  వెంకట్ మోహన్  దర్శకత్వం  వహిస్తున్నారు.  విశాల్  జ్ఞానవేలురాజ  సంయుక్తంగా  ఈ  చిత్రాన్ని  నిర్మిస్తున్నారు.