నాని తప్పు చేసాడా?

0
181

నాని ప్రస్తుతం జెర్సీ సినిమా నిర్మాణాంతర పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా ఏప్రిల్ నెలలో విడుదల కానుంది. 

నాని తదుపరి సినిమా మనం చిత్ర దర్శకుడు విక్రమ్ కుమార్ తో ఇటీవలే ప్రారంభమైంది. పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఒక వీడియో రూపంలో సినిమా టైటిల్ ని ప్రకటించింది. ఈ చిత్ర టైటిల్ ‘గ్యాంగ్ లీడర్’ . గ్యాంగ్ లీడర్ అనగానే తెలుగు ప్రేక్షకులకు ఎవ్వరికైనా గుర్తొచ్చేది మెగా స్టార్ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడరే. ఆ సినిమా అభిమానుల గుండెల్లో అలా నిలిచి పోయింది. ఇప్పటికీ ఆ సినిమా పాటలు , డ్యాన్సుల వీడియోలు , ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు చేస్తూనే వుంటాయి.

మరి నాని టైటిల్ మారుస్తాడా?

అయితే తాము ఇంతగా అభిమానించే సినిమా టైటిల్ ఎలా ఎసుకుంటాడని నాని పై విరుచుకుపడుతున్నారు మెగా అభిమానులు. చిత్ర టైటిల్ ని మార్చమని విజ్ఞప్తి చేస్తున్నారు మరికొందరు.

మరి నాని టైటిల్ మారుస్తాడా?